– ఎంపీడీవో శ్రీకాంత్, తహసీల్దార్ రంగారెడ్డి, డాక్టర్ స్నేహ, డాక్టర్ సైదమ్మ
నవతెలంగాణ-తలకొండపల్లి
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ స్నేహ, డాక్టర్ సైదమ్మ అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం తలకొండపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని ఎంపీడీవో శ్రీకాంత్, తహసీల్దార్ రంగారెడ్డి, డాక్టర్ స్నేహ, డాక్టర్ సైదమ్మతో కలిసి అన్ని గ్రామ పంచాయతీలలో జ్వరం వ్యాప్తి చెందకుండా వ్యాధి లక్షణాలు, నివారించేందుకు గ్రామపంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్నేహ మాట్లాడుతూ మురుగునీటి నిల్వ లేకుండా చూడాలనీ, అన్ని వీధుల్లో ఎప్పటికప్పుడూ సానిటేషన్ నిర్వహించి ప్రజలు సీజనల్ వ్యాధుల బారీన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని గ్రామాలలో స్ప్రే ఆపరేషన్ చేపట్టడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని కాలనీలలో పాగింగ్ చేయాలన్నారు. చిన్న చిన్న కాలనీలో చుట్టుపక్కల పిచ్చి మొక్కలు మొలవడంతో అక్కడ దోమలు ఎక్కువగా ఉంటాయనీ, ఆ ప్రదేశాల్లో ఫాగింగ్ చేయాలని చెప్పారు. వర్షాకాలంలో దోమలు అధికంగా ఉంటాయనీ, వాటిని నివారించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. శానిటేషన్ ప్రతి నీటిలో వాలంటీర్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ప్రజల అవగాహన పెంచాలని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సైదమ్మ మాట్లాడుతూ ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని కాలనీలలో సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీకాంత్, తహసీల్దార్ రంగారెడ్డి, తలకొండపల్లి డా.స్నేహ, గట్టుఇప్పలపల్లి డా.సైదమ్మ, ఏపీఓ కృష్ణ, పంచాయతీ కార్యదర్శులు బాలారాజ్, రాఘవేందర్, మహేష్, జంగయ్య, శరత్ కుమార్ గుప్తా, శేఖర్, పరమేష్, ప్రవీణ్, రమేష్ పాల్గొన్నారు.