మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలినవతెలంగాణ-తలకొండపల్లి
మధ్యాహ్న భోజన కార్మికుల తమ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం తలకొండపల్లి కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు కలిసి శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని, దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్నేండ్లుగా ఆర్థిక ఇబ్బందులు పడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు స్కూలు పిల్లల కడుపులు నింపుతు న్నామన్నారు. అలాంటి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవ హరించడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న బిల్లుల తోపాటు, జీవో 8 ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు, పీఆర్సీ వెంటనే అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల కార్యదర్శి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.