– గుట్కా ప్యాకెట్లను పట్టుకున్న పోలీసులు ఎస్‌ఐ గిరి వెల్లడి
నవతెలంగాణ-పెద్దేముల్
నిషేధించిన గుట్కా పొగాకు ప్యాకెట్లను ఎవరైనా విక్రయిస్తే సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ గిరి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో పెద్దేముల్ ఎస్‌ఐ గిరి ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది కిరాణా షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. పెద్దేముల్ గ్రామానికి చెందిన చాకలి సురేష్ కిరాణా షాపులో పోలీసులు దాడులు నిర్వహించి, 1680 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సుమారు రూ.3710 రూపాయలు ఉంటుందని తెలిపారు. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్టు ఎస్‌ఐ గిరి తెలిపారు.