104 ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి

– వైద్యారోగ్యశాఖ కమిషనర్‌కు టీయుఎంహెచ్‌ఇయు వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వైద్యారోగ్యశాఖలోని 104 ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయుఎంహెచ్‌ఇయూ -సీఐటీయూ అనుబంధం), హెచ్‌ 1 యూనియన్‌ డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు టీయుఎంహెచ్‌ఇయూ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్‌, హెచ్‌ 1 యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు సాయిరెడ్డి నేతృత్వంలో నాయకులు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బదిలీల్లో పారదర్శకత పాటించాలని కోరారు. గుర్తింపు సంఘం పేరుతో కొంత మంది చేసే పైరవీలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ, బదిలీలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటాననీ, 104 ఉద్యోగుల సమస్యలు, బదిలీల విషయం పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.