ఎఐ టూల్స్‌తో ఒప్పో రెనో 12 సిరీస్‌ ఫోన్లు

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ ఒప్పో కొత్తగా ఎఐ టూల్స్‌తో కూడిన రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. కృత్రిమ మేధా కలిగిన రెనో12, రెనో 12ప్రో ఫోన్లను అందుబాటులోకి తెచ్చినట్లు శుక్రవారం ఆ సంస్థ తెలిపింది. ప్రధాన కెమెరా 50 ఎంపి టెలిఫొటో సహా 2ఎంపి, 8ఎంపి కెమెరాలతో ఆవిష్కరించినట్లు పేర్కొంది. సెల్ఫీ కోసం 32 ఎంపి కెమెరాను కలిగి ఉంది. రెనో 12 ప్రో 12జిబి ర్యామ్‌, 256జిబి స్టోరేజ్‌ ధరను రూ.36,999గా, 12జిబి, 256జిబి ఒప్పో రెనో ధను రూ.32,999గా నిర్ణయించింది.