సమస్యల వలయంలో సాటాపూర్ సంత

– వ్యాపారస్తులకు తప్పని తిప్పలు

నవతెలంగాణ రెంజల్:
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్ సంత తెలంగాణలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన సంత. ప్రతి శనివారం జరిగే ఈ సంతకు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు విచ్చేసి పశువుల క్రయవిక్రయాలు జరుపుతూ ఉంటారు. వర్షాకాలంలో సాటా పూర్ సంత అత్యంత దయానియా మైనస్థితిలో ఉండడంతో వ్యాపారస్తులకు తీవ్ర అవస్థలు తప్పడం లేదు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ సంతలో సమస్యలతో సతమతమవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారస్తులకు ఎలాంటి సదుపాయాలు లేకపోవడం, వర్షాకాలంలో సొంత పూర్తిగా బురదమయం కావడం జరుగుతుంది. సాటాపూర్ సంతలో వ్యాపారస్తులకు పశువులను తీసుకువెళ్లడానికి వచ్చే వాహనాలకు సరి అయిన దిమ్మెలు లేకపోవడంతో మొరం కుప్పల ను ఆధారం చేసుకొని వాహనాలలోనికి పంపిస్తున్నారు. ప్రతి శనివారం ఆదాయం వస్తున్న పంచాయతీకి మౌలిక సదుపాయాలను తీర్చడంలో విఫలమవుతున్నారని వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. చిరుజల్లులకే రోడ్లు బురదమయం కావడంతో క్రయవిక్రయాలు జరపడం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారి పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సాఠాపూర్ సంత మౌలిక సదుపాయాలను సమకూర్చాలని వ్యాపారస్తులు కోరుతున్నారు.