ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను అందుబాటులోకి తేవాలి..

– బిఆర్ఎస్ నాయకుల ధర్నా
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : పట్టణ పరిధిలో నిరుపయోగంగా ఉన్న ఇంటిగ్రెటెడ్ మార్కెట్ ను అందుబాటులోకి తెచ్చి వీధి వ్యాపారులకు కేటాయించాలని శనివారం బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు  మాట్లాడుతూ  పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం  ప్రభుత్వ గెస్ట్ హౌస్ సమీపంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో  మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో  8 కోట్ల నిధులతో పేద, వీధి వ్యాపారుల కోసం సమీక్రుత మార్కెట్ యార్డ్ ను నిర్మాణం చేసి ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి దాదాపు 8 నెలలు గడుస్తున్నా.. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మార్కెట్ ను పట్టించుకోక పోవడం తో వీధి వ్యాపారులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేసారు.  నియోజకవర్గ అభివృద్ధి పై కనీస అవగాహనా లేక కాలక్షేపం చేస్తూ పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. కొందరు వ్యక్తులు  అందులో నివాసాలను ఏర్పాటు చేసుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇంత జరుగుతున్న పట్టించుకోకపోవడం  అసమర్ధ పాలనకు నిదర్శనం అని అన్నారు. నెల రోజుల్లోఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను వీధి వ్యాపారుల కొరకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేసారు. తేకపోతే బిఆర్ఎస్ పార్టీ  పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని,ఎమ్మెల్యేను హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, మాజీ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, మాజీ ఛైర్మన్ పెంట నరసింహ, అతికం లక్ష్మీ నారాయణ,  రచ్చ శ్రీనివాస్ రెడ్డి, చెన్న మహేష్, పంగరెక్కల స్వామి, ఇట్టబోయిన గోపాల్, తాడెం రాజశేఖర్, మైనారిటీ నాయకులు ఖాజా అజీమోద్దీన్, ఇక్బాల్ చౌదరి, అబ్దుల్ నయీమ్, మజహర్, కాజామ్, బబ్లు, ముజీబ్, అంజద్ అలీ,  యువనాయకులు నాగారం సూరజ్,  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.