స్థిత ప్రజ్ఞత!

నిండైన ఆ పళ్ళచెట్టుకి ఏం తెలుసు?
ఏపుగా ఎదగడం ఒదిగి నీడనిచ్చి
అందరికీ అమత ఫలాలివ్వటం తప్ప!
తినేవాడు ఆ కమ్మటి రుచికి మైమర్చి
కతజ్ఞతలు చెప్పినా..
అడ్డంగా వుందని అడ్డంగా నరికినా..
చెట్టు ఒకేలా స్వీకరిస్తుందంతే!
అందర్నీ ప్రేమించే అమ్మకేం తెలుసు?
కష్టనష్టాలకోర్చి అమలిన ప్రేమతో
కన్నవాళ్ళందర్నీ పెంచి పెద్దజేయటం తప్ప!
వాళ్ళు అమ్మ మీద ప్రేమ కతజ్ఞతతో
నెత్తిన పెట్టుకున్నా.. చూసే ఓపిక స్థోమత లేక వద్ధాశ్రమానికి తరలించినా..
తల్లిప్రేమలో ఏ తడబాటు ఉండదంతే!
అందరి ఆకలి తీర్చే రైతుకేం తెలుసు?
కాడి కట్టి మేడి పట్టి అరక దున్ని
ఆరుగాలం కష్టించి మట్టిలో మంచి
ముత్యాలు పండించి మనకు వెండి కంచాల్లో
వడ్డించి పరవశించడం తప్ప!
తినేవాడు కడుపు నింపినందుకు
కన్నీళ్ళతో కతజ్ఞత చూపినా..
బిచ్చగాడనుకొని ఈసడించినా..
అతడు మౌనఋషిలా తెల్లారింది మొదలు
తన పని తాను చేసుకుపోతూనే ఉంటాడంతే!
ఈ భూమ్మీద కొన్ని అంతే! వాటికి ఇవ్వటమే
తప్ప ఆశించడం భంగపడ్డం లేని జీవితాలు..
సష్టిలో మహౌన్నతమైన వాటికి
ఆ స్థితప్రజ్ఞత ఉంటుంది!!
– భీమవరపు పురుషోత్తమ్‌, 9949800253