జస్ట్‌ ఏ మినిట్‌ రిలీజ్‌కి రెడీ

Ready for release in just a minute‘ఏడు చేపల కథ’ ద్వారా పరిచయమైన అభిషేక్‌ పచ్చిపాల హీరోగా, నజియా ఖాన్‌, వినీషా జ్ఞానేశ్వర్‌ హీరోయిన్లుగా రెడ్‌ స్వాన్‌ ఎంటర్టైన్మెంట్‌, సుధర్మ మూవీ మేకర్స్‌ పతాకాలపై తన్వీర్‌, ప్రకాష్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జస్ట్‌ ఎ మినిట్‌’. యశ్వంత్‌ దర్శకత్వంలో కామెడీ, లవ్‌ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 19న సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు తన్వీర్‌, ప్రకాష్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పని చేసాం. ఈనెల 19న రిలీజ్‌ చేస్తున్నాం. ప్రేక్షకులు సినిమా చూసి ఆదరించి, మంచి సక్సెస్‌ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం’ అని అన్నారు. ‘ఈ సినిమా మొత్తం మంచి ఫన్‌ ఉంటుంది. డైరెక్టర్‌ యశ్వంత్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ బాజీ ఇచ్చిన మ్యూజిక్‌ సినిమాకి హైలైట్‌. నిర్మాతలు చాలా బాగా సపోర్ట్‌ చేశారు. సినిమా ఎవరిని డిసప్పాయింట్‌ చేయదు’ అని హీరో అభిషేక్‌ పచ్చిపాల చెప్పారు. దర్శకుడు యశ్వంత్‌ మాట్లాడుతూ,’నేను ఈ సినిమాకి కో డైరెక్టర్‌గా వచ్చాను. అనుకోని కారణాలవల్ల నిర్మాత తన్వీర్‌ నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రస్తుతం వస్తున్న సినిమాలతో పోలిస్తే ఆద్యంతం వైవిధ్యంగా ఉండే సినిమా ఇది’ అని తెలిపారు.