చిన్నేరు వాగు బ్రిడ్జ్ ను వెంటనే పూర్తి చేయాలి: సీపీఐ(ఎం)

Chinneru Vagu Bridge should be completed immediately: CPI(M)నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని నందనం సిరివేణికుంట మధ్యగల చిన్నేరు వాగు నిర్మాణం గత సంవత్సరం నుండి పెండింగ్లో ఉండడం వల్ల రైతులకు ప్రజలకు రాకపోకలు బంద్ అయి అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి గానికి ప్రజలకు సాగునీరు రాకపోకలకు ప్రయాణాన్ని సుగమం చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నరసింహ అన్నారు. ఆదివారం సీపీఐ(ఎం) పోరుబాట సందర్భంగా సిరివెనుకుంట చిన్నేరు వాగును సందర్శించి అనంతరం వారు మాట్లాడుతూ.. గత సంవత్సరంలో ఆర్భాటంగా సిరివేనుకుంట బ్రిడ్జిలు ప్రారంభించి ఇప్పటివరకు పూర్తి చేయకుండా రైతులను, ప్రజలను రాకపోకలకు సాగునీరుకు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, బ్రిడ్జి నిర్మాణం చేయకపోవడం వల్ల ప్రజలకు, రైతులకు ఇబ్బందులు జరుగుతున్నాయని వారన్నారు. షామీర్ పేట చెరువు నుండి వచ్చే చిన్నేరు వాగు భువనగిరి, బీబీనగర్, వలిగొండ మండలాలకు సాగునీరు అందించడానికి ఉపయోగపడుతుందని వారు అన్నారు. బీబీనగర్ మండలంలో 10 గ్రామాలు, భువనగిరి మండలంలో చుట్టూ ఉన్న గ్రామాలకు చిన్నేరు వాగు ద్వారా సాగునీరు అందుతుందని బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్ల రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని  అన్నారు. అధికారులు వెంటనే స్పందించి నందనం – సిరివేణి కుంట చిన్నేరు వాగు బ్రిడ్జిని పూర్తి చేయాలని, పూర్తి  చేయకపోతే రానున్న కాలంలో ప్రజలను సమీకరించి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటాల నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం మండల కమిటీ సభ్యులు ఎల్లెంల వెంకటేశం జిట్ట అంజిరెడ్డి, కళ్ళెం సుదర్శన్ రెడ్డి నాయకులు సింగిరెడ్డి భూపాల్ రెడ్డి, కొల్లూరి సిద్దిరాజు, మామిడి లచ్చిరెడ్డి, సిరివేణి కుంట మాజీ సర్పంచ్ అనిత వెంకటేశం ,కొండాపురం వీరస్వామి, ములుగు మధు, ములుగు దుర్గాప్రసాద్, పాల్గొన్నారు.