కాల్పుల విరమణ చర్చల నుంచి వైదొలుగుతున్నాం : హమాస్‌

కాల్పుల విరమణ చర్చల నుంచి వైదొలుగుతున్నాం : హమాస్‌గాజా : గాజా సంధి చర్చల నుంచి వైదొలుగుతున్నట్టు హమాస్‌ సీనియర్‌ అధికారి ఆదివారం తెలిపారు. ఇజ్రాయిల్‌ ”ఊచకోత” మరియు చర్చలలో దాని వైఖరి కారణంగా కాల్పుల విరమణ చర్చల నుండి హమాస్‌ వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆక్రమిత ఇజ్రాయిల్‌ గంభీరత లేకపోవడం, వాయిదా వేయడం, అడ్డుకోవడం, నిరంతర విధానం , నిరాయుధ పౌరులపై జరుగుతున్న మారణ కాండల కారణంగా చర్చలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్టు హమాస్‌ రాజకీయ నేత ఇస్మాయిల్‌ హనియే అంతర్జాతీయ మధ్యవర్తులతో చెప్పినట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇజ్రాయిల్‌ వైమానిక దాడిలో హత్య చేయడానికి ప్రయత్నించినప్పటికీ, హమాస్‌ మిలటరీ చీఫ్‌ మహ్మద్‌ డెయిఫ్‌ను సురక్షితంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. హమాస్‌ మిలటరీ విభాగం కార్యకలాపాలను కమాండర్‌ మహ్మద్‌ డెయిఫ్‌ క్షేమంగానే ఉన్నారని, ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నాడని ఆ అధికారి తెలిపారు.