75 వన మహోత్సవం కార్యక్రమములో భాగంగా రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోమవారం మంథని మున్సిపల్ పరిధిలో అమృత్ – 2 పథకం కింద కేంద్ర, రాష్ట్ర నిధులు రూ.12కోట్ల 10లక్షలతో మంథని పోచమ్మ వాడ వద్ద రూ.8 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ తొ పాటు 25 కి.మీ పైప్ లైన్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంథని మున్సి పాలిటీ ఆధ్వర్యంలో గురుకుల బాలుర పాఠశాల/కళాశాల ఆవరణలో 75 వన మహోత్సవం మొక్కలు నాటే కార్యక్రమములో పాల్గొని మొక్కలు నాటి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.