అంబేద్కర్ విగ్రహం వద్ద గోడ ప్రతుల విడుదల..

Wall copies released at Ambedkar statue..నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం రోజు ముదిరాజులు గోడ ప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముదిరాజులను బీసీ డీ నుండి ఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1000 కోట్ల నిధులు మంజూరు చేయాలని చెరువులలో తమకు వచ్చే హక్కులను పూర్తిగా కల్పించాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ముదిరాజ్ అధ్యక్షులు గంపల వెంకన్న,  ప్రధాన కార్యదర్శి సత్య బోయిన నారాయణ ముదిరాజ్ మరియు మండల కార్యవర్గ సభ్యులు నారాయణ,  సిహెచ్ బాలయ్య కృష్ణ, సత్యం తదితరులు పాల్గొన్నారు.