ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా కమిటీ సభ్యులు కోకిల బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని పసర గ్రామంలో బాబు మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు పాఠశాల యజమాన్యాలు మరియు ప్రైవేటు బుక్స్ స్టాల్ యాజమాన్యాలు కుమ్మక్కై విద్యార్థుల తల్లిదండ్రులపై పెనుబారం మోపుతున్నారని అన్నారు. విద్యార్థులకు చదువుకు సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలు పాఠశాల యజమాన్యాల దగ్గరనే తప్పనిసరిగా కొనుగోలు చేయాలని నిబంధనలు అమలు చేస్తూ ఆ యొక్క నిబంధనలు బుక్ స్టాల్ యజమానుల చేతిలోకి ఆజమషి ఇచ్చి వారికి ఇష్టం వచ్చిన ధరలకు పాఠ్యపుస్తకాలు అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులపై మోయలేనంత ఆర్థికబారం మోపుతున్నారని పేర్కొన్నారు. ఈ యొక్క ఘటనపై మండల ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల యజమాన్యాలపై బుక్ స్టాల్ యజమానులపై చర్యలు తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రులపై పెనుబారాలు మోపకుండా చూడాలనీ అధికారులకు సూచించారు.
ఇదే తరుణంలో ప్రైవేటు పాఠశాల యజమాన్యాలు తల్లిదండ్రులకు మధ్య పాఠ్యపుస్తకాలు స్కూలు ఫీజుల విషయాలలో జిల్లా విద్యా అధికారులు మరియు జిల్లా ఉన్నత అధికారుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి విద్యా హక్కు చట్టం నిబంధనల నిబంధనల ప్రకారం మండలంలోని ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు పకడ్బందీగా విద్య చట్టం ని అమలు చేయాలని పేద మరియు మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులపై పెను బారాలు మోపకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు పసర, మరియు గోవిందరావుపేట మండలంలోని కొన్ని ప్రైవేట్ బుక్ స్టాల్ యందు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు మరియు ప్రభుత్వం సప్లై చేసే అటువంటి నోట్ పుస్తకాలు కూడా విక్రయిస్తున్నారని ఆయన అన్నారు కావున పసర, గోవిందా రావుపేట ఉన్నటువంటి అన్ని పుస్తక విక్రయశాలపై అధికారులు తనిఖీలు చేయాలని అన్నారు లేని పక్షంలో భారత విద్యార్థి సమాఖ్య ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పసర గ్రామంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించ తల పెడతమన్నారు అదేవిధంగా సాంఘిక సంక్షేమ మరియు గిరిజన హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారాలు అందించాలని స్థానికంగా ఉండని హాస్టల్ వెల్ఫేర్ అధికారులపై చర్యలు తీసుకునేలా అధికారులు అలాంటి దిశగా ఆదేశాలు జారిచేయాలని ఆయన అన్నారు.