వర్షాల ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో ప్రజలు సీజనల్ వ్యాధులకు గురైఎ ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం కల్పించుకొని ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేయాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కొత్తపెల్లి రేణుక ప్రభుత్వాన్ని కోరారు.సోమవారం సూర్యాపేటలోని విక్రమ్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలం వచ్చినందువల్ల వర్షాల ప్రభావంతో అన్ని పరిసరాలు నీటి తోటి చెత్తాచెదారం తోటి నిండి ఉంటాయి అని అన్నారు. దీనివల్ల ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ మరియు విష జ్వరాలు ప్రబలి ప్రజలు రోగాల భారిన పడే అవకాశం ఉంది అన్నారు. కాబట్టి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన తక్షణమే ప్రజలకు అవసరమైన మందులను అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో అందుబాటులో ఉంచి, సరిపోను సిబ్బందిని నియమించాలని అన్నారు. అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించి ప్రత్యేక శిజరాలను ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిది అన్నారు. కాబట్టి ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, దోమలు ఈగల బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ,ఉపాధ్యక్షులు సూరం రేణుక,పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్,గులాం,రామోజీ, ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి వాజిద్, పివైఎల్ జిల్లా నాయకులు వేర్పుల పరుషరాం తదితరులు పాల్గొన్నారు.