ఎన్‌సీసీ సెలక్షన్‌ ప్రక్రియ ప్రారంభం

ఎన్‌సీసీ సెలక్షన్‌ ప్రక్రియ ప్రారంభంనవతెలంగాణ-బోథ్‌
మండలంలోని సొనాల జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో సోమవారం 29 ఎన్‌సీసీ సీట్లకు విద్యార్థులకు ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. 13 మంది బాలికలు, 16 మంది బాలురులను ఎంపిక చేశామని ఎంపిక ప్రక్రియ పాఠశాల అసోసియేట్‌ అధికారి అన్వర్‌ అలీ తెలిపారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు ఆంజనేయులు, ప్రధానోపాధ్యాయులు సచిన్‌, ఉపాధ్యాయులు మధుసుధన్‌, రమేష్‌ పాల్గొన్నారు.