రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి చలపతిరావు దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘సారంగ దరియా’. ఈ సినిమా ఈనెల 12న విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి స్పందనని రాబట్టుకుంది. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. రాజా రవీంద్ర మాట్లాడుతూ, ‘మాకు మంచి థియేటర్లు దొరికాయి. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. టెక్నికల్ టీమ్ చాలా కష్టపడింది. మోయిన్, మోహిత్, యశస్విని నా కంటే చాలా బాగా నటించారు. అందరి పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇండిస్టీలోకి వచ్చిన తరువాత ఇదే నాకు హ్యాపియెస్ట్ మూమెంట్. నా కెరీర్‌లో ఇదొక మంచి చిత్రంగా నిలిచింది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’ అని అన్నారు. ‘విడుదలైన అన్ని థియేటర్లలో బాగా ఆడుతోంది. ఇంత రెస్పాన్స్ చూస్తూ ఉంటే నాకు సంతోషంగా ఉంది. మొదటి రోజు తక్కువ మంది చూశారు. మౌత్ టాక్ వల్ల మెల్లి మెల్లిగా కలెక్షన్లు పెరుగుతున్నాయి. మంచి కథతో సినిమా తీశాం. మంచి కాన్సెప్ట్ అనే నమ్మకం ఉంది. మున్ముందు ఇంకా కలెక్షన్లు పెరుగుతాయన్న నమ్మకం ఉంది’ అని నిర్మాత శరత్ చెప్పారు. దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి మాట్లాడుతూ, ‘థియేటర్ కోసమే ఈ సినిమాను తీశాం. మా నిర్మాత చాలా సపోర్ట్ చేశారు. మ్యూజిక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రాజా రవీంద్రతో పాటు మిగిలిన నటీనటులు అద్భుతంగా నటించారు. మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’ అని తెలిపారు.