కాంగ్రెస్‌లో కష్టపడి పనిచేసే వారికే పార్టీ పదవులు

కాంగ్రెస్‌లో కష్టపడి పనిచేసే వారికే పార్టీ పదవులు– ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి
– ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌ ఓబీసీ ప్రధాన కార్యదర్శిగా పొలమోని రామలింగం నియామకపత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-యాచారం
కాంగ్రెస్‌లో కష్టపడి పనిచేసే వారికే పార్టీ పదవులు ఉంటాయని ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండల పరిధి లోని మాలి గ్రామానికి చెందిన పొలమోని రామలింగంను ఇబ్రహీం పట్నం ఓబీసీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసి నియా మక పత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం రామ లింగం ఎమ్మెల్యే రంగారెడ్డికి, కాంగ్రెస్‌ పెద్దలకు కతజ ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ ..రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లి గ్రామాల్లో కాంగ్రెస్‌ బలోపేతానికి నిరంతరం పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మస్కునర్సింహా, జిల్లా ఉపాధ్యక్షు గులాం అక్బర్‌, బీసీసెల్‌ అధ్యక్షులు వరికుప్పల తిరుమలేష్‌, ఎస్సీి సెల్‌ అధ్యక్షులు చిన్నోళ్ల మల్లేష్‌, బీసీసెల్‌ ఉపాధ్యక్షడు శివలింగచారి, మాల్‌ ఉపాధ్యక్షలు అండెకర్‌రవి, ఎల్గపల్లిరాజు తదితరులు పాల్గొన్నారు.