అంగన్‌వాడీ టీచర్స్‌అండ్‌ వెల్ఫేర్‌ సమస్యలు పరిష్కరించాలి

అంగన్‌వాడీ టీచర్స్‌అండ్‌ వెల్ఫేర్‌ సమస్యలు పరిష్కరించాలి– తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి
– రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్ప ర్స్‌ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని లేనిచో సమ స్యలు పరిష్కారమయ్యే వరకూ పోరాటం కొనసా గుతూనే ఉంటుందని తెలంగాణ అంగన్‌వాడీ టీ చర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ ప్ర ధాన కార్యదర్శి జయలక్ష్మి స్పష్టం చేశారు. సోమ వారం రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యం ఎదుట అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ వర్కర్స్‌ తమ సంస్థలను పరిష్కరించాలని ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పిలుపులో భాగంగా జీవో నెం బర్‌ 10ని రద్దు చేయాలి, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ పెన్షన్‌ పెంచుతూ వీఆర్‌ఎస్‌ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవో ఇవ్వాలని హెల్పర్లకు పాత పద్ధతిలోనే ప్రమోషన్‌ ఇవ్వాలన్నారు. 24 రోజుల సమ్మె సంద ర్భంగా అంగన్‌వాడీ టీచర్స్‌ హెల్పర్స్‌కు గత ప్రభు త్వం ఇచ్చిన హామీలు కాంగ్రెస్‌ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాల ని డిమాండ్‌ చేశారు. 2023 సెప్టెంబర్‌ 11 నుం చి అక్టోబర్‌ 4 వరకు 24 రోజులు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేశారు. నాలుగో 10 2023న అంగన్‌వాడీ జేఏసీ రాష్ట్ర నాయకత్వంతో ఆనాటి ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు ఐసీడీఎఫ్‌ మంత్రి సత్యవతి రాథోడ్‌ గార్లతో చర్చలు జరిగాయి. హె ల్పర్ల కో రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అంగన్‌వాడీ టీచర్లకు రూ.2 లక్షలకు ఒక లక్ష ఆసరా పెన్షన్‌ చెల్లిస్తామని తెలంగాణ రాష్ట్ర రెండో అభ్యర్థుల ప్రభుత్వ ఉద్యో గులకు ప్రకటించిన 5 శాతం అయ్యారని అంగన్‌ వాడీ టీచర్స్‌ ఏర్పాటు చేస్తామని సమ్మె కాలపు వే తనాలు చెల్లిస్తామన్నారు. ప్రమాద బీమా రూ.2 లక్షలు చెల్లిస్తామని టీఏడీఏలు మే నెల సెలవులు ఆన్‌లైన్‌లో ఒకే యాప్‌ ఉండే విధంగా చేస్తామని మిగిలిన సమస్యలపై ఆనాడు ఐసీడీఎఫ్‌ మంత్రి సత్యవతి రాథోడ్‌ సమక్షంలో చర్చలు జరిపి పరి ష్కరిస్తామని మంత్రులు చెప్పి మోసం చేసి వెళ్ళిపో యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ ప్రకటిం చే సందర్భంలో వేతనాలు పెంచుతామని స్పష్టమై న హామీ ఇచ్చారు. 24 రోజుల సమ్మె కాలం వేత నాలు వెంటనే చెల్లించాలి, వేతనాలు ప్రతి నెలా 5వ తేదీ లోపల అంగన్‌వాడీ టీచర్స్‌ హెల్పర్స్‌కు చెల్లించాలని, రెండవ పీఆర్సీ ఫైనల్‌ చేసేటప్పుడు పేస్కేల్‌ కనీస వేతనం నిర్ణయించాలని ఆమె అ న్నారు. జీఓ ఎంఎస్‌ఎఫ్‌ నెంబర్‌ పదవి రద్దు చే యాలన్నారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌గా టీచర్స్‌కి రూ.లక్షలు హెల్పర్స్‌తో ఒక లక్ష ఇస్తూ జీవో జారీ చేయాలన్నారు. చివరి నెల జీతంలో సగం జీవితం పెన్షన్‌గా ఐసీడీఎఫ్‌ నుండి ఇవ్వాలని వాలెంటరి మెంట్స్‌ విఆర్‌ఎస్‌ స్కీం ఏర్పాటు చేయాలి, ముఖ్య మంత్రి అంగన్వాడీలకు ఇస్తామన్న 18 వేలువేత నం వెంటనే ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. అనంతరం ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం తో ఆయన పీఏకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్‌ మండల కమిటీ సభ్యులు కురుమయ్య ,జంగయ్య, గండిపేట్‌ మండల కన్వీనర్‌ డప్పు ప్రవీణ్‌ కుమా ర్‌, అధ్యక్షురాలు సుధారాణి సుమలత, మాధవి, మీనా, సులోచన తదితరులు పాల్గొన్నారు.