ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన కట్టెల శివకుమార్ 

Kattela Sivakumar met SC Corporation Chairmanనవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నగారి ప్రీతం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్రం అధ్యక్షులు కట్టెల శివకుమార్ మంగళవారం కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తెలంగాణ  ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నల్గొండ జిల్లా వ్యక్తి రావడం సంతోషమైన విషయం అన్నారు. కావున పేద, బడుగు బలహీన, దళిత, వర్గాల ప్రజల అభ్యున్నతికై కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కార్యదర్శి తరుణ్, కొండేటి నరేష్ కుమార్, అలంపల్లి కొండన్న, పాల్గొన్నారు.