గ్రామాల్లో పీర్ల ఊరేగింపు

Procession of pirs in villages

నవతెలంగాణ – బొమ్మలరామారం  
మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకునే మొహర్రం పండుగ సందర్భంగా మంగళవారం మండలంలోని మార్యాల, చౌదర్ పల్లి తో పాటు పలు గ్రామాలలో పీర్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున పీర్లు తీసుకొని ఆయా గ్రామస్తులు గ్రామాల్లోని పుర:విధుల్లో ఊరేగింపుగా తిరిగారు. ఊరేగింపులో భక్తులు కుడకలు, దట్టీలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.ఐదు రోజులపాటు జరిగే ఈ మొహర్రం వేడుకలు బుధవారం పూర్తవుతాయని ఆయా గ్రామాల పూజారులు తెలిపారు.