
గో సంరక్షణ సభ్యుల సమాచారం మేరకు రూరల్ సిఐ కె శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేల్పూర్ మండలంలోని లక్కోరా గ్రామ జాతీయ రహదారి వద్ద మంగళవారం రైస్ మీల్ దగ్గర 22 ఆవులను మంగళవారం పట్టుకున్నారు. మండలంలోని గోవింద్ పెట గ్రామానికి చెందిన ఒకరు, ఈయనతో పాటు మరికొందరు ఆవులను తరలిస్తున్నట్లు తెలిసి పట్టుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా గో సంరక్షణ సమితి సభ్యులు సతీష్ మాట్లాడుతూ.. ఆవులను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో అక్కడకు చేరుకొని పోలీసులకు సమాచారం అందించినట్టు ఇకముందు అక్రమ రవాణా జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరినారు. ఈ కార్యక్రమంలో గో సంరక్ష సమితి సభ్యులు లక్కీ, రవి, నందు, బబ్లు, మహేష్, సాగర్, శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ మల్లేష్ ,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.