డార్లింగ్‌ బ్లాక్‌బస్టర్‌ ఖాయం : నాని

Darling is sure to be a blockbuster: Naniప్రియదర్శి, నభా నటేష్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘డార్లింగ్‌’. అశ్విన్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కె.నిరంజన్‌ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈనెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ నిర్వహించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి హీరో నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”డార్లింగ్‌’ టీజర్‌, ట్రైలర్‌ చాలా ఎంటర్‌ టైనింగ్‌గా ఉన్నాయి. ఈ మధ్య యాక్షన్‌ సినిమాలు ఎక్కువైపోయి కామెడీ, లవ్‌ స్టొరీలను మిస్‌ అవుతున్నాం. ఈ సినిమా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ కావాలి. దర్శి లాంటి ట్యాలెంటెడ్‌ యాక్టర్‌ ఇలాంటి డిఫరెంట్‌ సబ్జెక్ట్స్‌ సెలెక్ట్‌ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. స్ల్పిట్‌ పర్సనాలిటీ కాన్సెప్ట్‌ అదిరిపోయింది. లేడి అపరిచితుడు. ఇలాంటి కాన్సెప్ట్‌తో సరిగ్గా చేస్తే ఎంత లాఫ్టర్‌ జనరేట్‌ చేయవచ్చో ఊహించగలను. ట్రైలర్‌ చూస్తుంటే పర్ఫెక్ట్‌ ఎంటర్‌టైనర్‌ అనిపిస్తుంది. నిరంజన్‌ , చైతన్య ‘హనుమాన్‌’ అంత సక్సెస్‌ డార్లింగ్‌ కావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్‌ అశ్విన్‌కి ఆల్‌ ది వెరీ బెస్ట్‌. నభా ‘డార్లింగ్‌’తో న్యూ చాప్టర్‌ స్టార్ట్‌ చేస్తున్నారు. నా వాల్‌ పోస్టర్‌ బ్యానర్‌ నెక్స్ట్‌ సినిమాలో దర్శినే హీరో. జగదీశ్‌ ఈ మూవీకి డైరెక్టర్‌. జోనర్‌ మిగతా వివరాలు త్వరలో చెప్తాం’ అని తెలిపారు. ‘చిన్నప్పుడు చిరంజీవిని చూసి యాక్టర్‌ కావాలని ఇన్స్పిరేషన్‌ అయితే ఇప్పుడు నాని ఇన్స్పిరేషన్‌. ప్రేక్షకుడు ఇచ్చిన టైమ్‌కి వాల్యూ యాడ్‌ చేయాలని అనుకుంటా. ఒక మంచి సినిమా మీకు మళ్ళీ తిరిగివ్వాలి. మీరు మాకిస్తున్న ప్రేమని రెండింతలు తిరిగివ్వాలని నేను అనుకుంటున్నాను. ఈనెల 19న మీతో కమ్యునికేట్‌ చేస్తా, మిమ్మల్ని ఎంగేజ్‌ చేస్తా. మీరు థియేటర్‌ కి వస్తే మా టీం తరపున మీరు అనుకున్నదాని కంటే ఎక్కువ ప్రేమ ఇస్తా’ అని అన్నారు.