ముదిరాజ్ లను బీసీ ఎ జాబితాలో చేర్చాలి

నవతెలంగాణ – రాయపర్తి

ముదిరాజ్ కులస్థులను బీసీడీ నుంచి బీసీ ఏ జాబితాలోకి చేర్చాలని ముదిరాజ్ మహ సభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ పిలుపు మేరకు  మండల కేంద్రంలోని రాష్ట్ర ఎన్ఆర్ఐ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్, మహాసభల అధ్యక్షుడు పొన్నం మోగిలి  ముదిరాజ్ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ జనాభా కలిగిన ముదిరాజ్ కులస్థులను బిసి డి నుంచి ఏ జాబితాలోకి చేర్చాలని, వెనుక బడిన తరగతులలో జనాభాలో 13శాతం నుండి 14శాతంగా పేర్కొబడిందన్నారు. ముదిరాజ్   జనాభాలో  మత్స్యవృత్తి, తోటల పెంపకం,ఇతర వృత్తులపైన జీవనం కొనసాగిస్తున్నా మిగతా వారు ఇతర వృత్తులపై ఉండి ఆత్యంత పేదరికములో దుర్భరమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2023 జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో “అభయహస్తం” లో హమీలు కొంత విశ్వాసాన్ని కలుగజేశాయని, అధికారములోనికి వచ్చి ఆరు మాసాలు పూర్తయిన సందర్భంగా మా సమస్యల పరిష్కారం చేయాలని కోరారు. ముదిరాజ్ లను బి.సి. “డి” నుండి బి.సి. “ఏ” లోకి పునరుద్ధరణ చేసి తక్షణమేు బీసీ “ఏ”లో మార్చడం జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు బండారి శ్రీనివాస్, జిల్లా సొసైటీ డైరెక్టర్ చెవ్వు కాశినాధం, మండల టిఆర్ఏంఎస్ అధ్యక్షుడు ముద్రబోయిన సుధాకర్ ముదిరాజ్, మండల ఉపాధ్యక్షుడు షాపురం సాయిలు, బోయిన కుమార్, నారబోయిన యాకయ్య ముదిరాజ్, జంగిలి నరేష్ ముదిరాజ్, గూడెల్లి వెంకటయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.