2018 కంటే ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి

– లేకుంటే  రైతు వ్యతిరేకత ఖచ్చితం
– నిభందనలను సవరించి, సరళమైన మార్గంలో రుణ మాఫీ జరగాలి
– రుణం పొందిన రైతులందరినీ సమానంగా చూడాలి
నవతెలంగాణ – జుక్కల్
రాష్ట్రంలో ఎంపిక చేసిన రైతులు, 2018 నుండి 2023 లోపు  రుణం పొందిన రైతులకు తెల్లరేషన్ కార్డు అధారంగా  రైతులకు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా మెుత్తం  39 లక్షల మంది  రైతులు ఉన్నారు. రెండులక్షల రుణమాఫీ అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. రూ.1 లక్ష  లోపు రుణం  పొందినవారు 11లక్షల 50  వేల  మంది రైతులున్నారు. మెుత్తం కలిపి ముప్పై వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి   కేటాయించారు.   రుణ మాఫీ అని ప్రభుత్వ పెద్దలు మీడీయా ముందు ప్రగల్భాలు పలకుతున్నారు. 2018 కంటే ముందు బ్యాంకు నుండి వ్వవసాయ రుణాలు పొందిన రైతులు వారు రైతులు కారా? మరీ మా మాటేంటి? 2018 కంటే వెకాల ఉన్న 2015  బకాయిపడ్డ రైతుల  మాఫీ కానీ  రైతులంటే చులకన బావం చూపిస్తుంది.  అందరి రైతులకు ప్రభుత్వం  సమాన దృష్టితో చూడాలి. కొంత మంది రైతులకు రుణ మాఫీ జరిగితే, 2018 కంటే ముందున్న రుణం తీసుకున్న రైతుల మనసులు నొప్పించినట్టే అవుతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో రుణ మాఫీ కానీ 14′ 15, 16, 17, సంవత్సరాలలో రైతుల నుండి భారీగా వ్వతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రాబోయే స్థానిక  సంస్థల ఎన్నికల  పార్టీ ప్రతిష్టతో పాటు, అభ్యర్థుల గెలుపు ఓటముల మీద ప్రభావం తప్పదని రుణం మాఫీ జరగని రైతులు అంటున్నారు. అన్యాయం జరిగిన రైతులు తమకు కూడా రుణమాఫీ చేయాలని, డబ్బులు లేకనే  ఏండ్లుగా కట్టలేక ఇబ్బంది పడుతుంటే గతంలో  వైస్ రాజశేఖర్ రెడ్డి ప్రతి ఎటా రెగ్యులర్ రిన్యువల్  చేసే  వారికి రుణ మాఫీ చేయక పోవడం, వారికి ఐదువేలు మాత్రమే ఇవ్వడం, మిగత బకాయిలు కట్టని  వారికి పూర్తీగా రుణమాఫీ చేసారని గుర్తు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం: రైతు రుణ మాఫీ చేస్తే అందరి రైతులకు సమ న్యాయం జరగాలి కానీ విభజించి పాలించు అనే విధంగా కట్ఆఫ్ తేది,  సంవత్సరం పెట్టడం 2015  అంతకు  ముందు నుండి రుణం పొందిన  లక్షల మంది రైతులు బ్యాంకులకు రైతులు బాఖీ పడటం, బ్యాంకు వారు ఇంకా రైతులను వేధించడం మళ్ళీ మెుదటికే వస్తుంది. గతం లో మాదిరిగా రైతులకు ఉన్న రుణాలను అందరికి రెండు లక్షల రుణ మాఫీ చేస్తే రైతులు అనంద పడుతారు. లేకుంటే రైతు వ్యతిరేకి అనే ముద్ర పడే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ముఖ్యమంత్రి పునర్ ఆలోచన చేసి బ్యాంకులకు బకాయిలు,  అందరికి న్యాయం చేస్తారని 2015 రుణం పొంది బకాయి పడ్డ రైతులు అంటున్నారు. లేకుంటే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో మా తడాఖా చూపీస్తామని  రైతులు హెచ్చరికలు చేస్తున్నారు.