నూతన హోటల్ ప్రారంభించిన వినయ్ రెడ్డి

Vinay Reddy opened a new hotelనవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని తెలంగాణ హోటల్ ను ఆర్మూర్ కాంగ్రెస్ నియోజక వర్గ ఇంఛార్జి పి. వినయ్ రెడ్డి బుదవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్త మైనార్టీ నాయకులు అరిఫ్ నూతన్ హోటల్ పెట్టుకొని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యకర్తలు అందరూ కూడా స్వయం ఉపాధి కల్గి ఉండాలని తెలిపారు. అరిఫ్ ని ఆశీర్వదించి హోటల్ దిన దిన అభివృద్ధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవి ప్రకాష్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు వెంకటేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ సంఘటన అద్యక్షులు గంగాధర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి డేగ పోషేట్టి, సింగిల్ విండో చైర్మన్ బుర్రోల్ల అశోక్, మాజీ సర్పంచ్ రాజేందర్, అలిం, గోరె మియ, జైల్ సింగ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.