
నూతన దంపతులు ఆత్మహత్య చేసుకొనుటకు కారణం అయిన నిందితురాలిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు బుధవారం రైల్వే పోలీస్ స్టేషన్ లో ఎస్సై సాయ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి పోతంగల్ మండలం, హెగ్డోలి గ్రామానికి చెందిన బండారి అనిల్ కుమార్, శైలజ సంవత్సరం న్నర క్రితం వివాహం జరిగింది. అయితే ఫకీరాబాద్ మిట్టా పూర్ మధ్యలో రైలు పట్టాల పై గుర్తు తెలియని ట్రైన్ కింద పడి మృతి చెందారు. కేసు నమోదు చేసుకొని పరిశోధన ప్రారంభించడం జరిగిందని అందులో భాగంగా మృతురాలు చేసిన సెల్ఫ్ వీడియో బయటకు రావడం జరిగిందని రైల్వే సీఐ శ్రీనివాస్ తెలిపారు. సాక్షుల ఆధారంగా మృతురాలు పిన్ని కంకోళ్ళ లక్ష్మి నీ అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు. అనంతరం రిమాండ్ కొరకు హైదరాబాద్ రైల్వే కోర్టుకు తరలించామని తెలియజేశారు.