పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే..

MLA who launched the bookనవతెలంగాణ – ఆర్మూర్ 

ఓ భారతీయుడా  అనే పుస్తకాన్ని  బుధవారం స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి  ఆవిష్కరించారు. బీజేపీ సీనియర్ నాయకులు లోక భూపతి రెడ్డి ఆధ్వర్యంలో అంకాపూర్ ఎమ్మెల్యే స్వగృహంలో భారత్ సురక్షా సమితి జిల్లా అధ్యక్షులు శ్రీ పుప్పాల రాజేందర్ , కార్యదర్శి, న్యాయవాది శ్రీధర్, రవినాథ్ లు అందచేశారు. నాటి ప్రధాని  ఇందిరా గాంధీ విధించిన ఏమర్జెన్సీ కి వ్యతిరేకంగా పోరాడి, జైలుకు వెళ్లి నా విషయాలను చర్చిoచుకున్నారు. ఈ సందర్భంగా ఏమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన శ్రీ పుప్పాల రాజేందర్, శ్రీధర్, రవినాథ్ శాలువాతో సన్మానిoచడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికారప్రతినిధి కలిగోట గంగాధర్, రూపాలి నర్సయ్య,యమాద్రి లింగన్న, సుమన్, సంజీవ్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.