
నవతెలంగాణ – నెల్లికుదురు
కామ్రేడ్ పేరుమాండ్ల జగన్నాథం ఆశలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు బాణాలయాకయ్య సీనియర్ నాయకుడు బాబు గౌడ్ అన్నారు మండలంలోని మేనల గ్రామంలో కామ్రేడ్ కీర్తిశేషులు నిర్మల జగన్నాథం 43వ వర్ధంతిని ఘనంగా బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్నాథం తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడి కూలీల రైతుల పట్ల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అన్నారు. పేదల పక్షాన పోరాడి పెత్తందారులపై ఎదురు తిరిగి ఎన్నో రకాల ఉద్యమాలు చేపట్టాలని అన్నారు. ఆ రోజుల్లో పేదలను అనగదొకే క్రమంలో ఎంతోమంది భూస్వాములకు వ్యతిరేకించి భూమి మీద పంచే కార్యక్రమంలో పాల్గొని పేదలకు న్యాయం జరిగే విధంగా ప్రాణాలను లెక్కచేయకుండా ఉద్యమించిన నాయకుడు అని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి వర్ధంతి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపిటిసి పెరుమాండ్ల గుట్టయ్య రామరాజు సమ్మయ్య తోట నరసయ్య బత్తిని వెంకన్న తోట శ్రీనివాస్ పెరుమాండ్ల వెంకన్న తో పటు కొంతమంది పాల్గొన్నారు.