
– విద్యుత్ వినియోగదారుల ఫోరం-1 టీజీ ఎన్పీడీసీఎల్ , వరంగల్
నవతెలంగాణ – తాడ్వాయి
విద్యుత్ వినియోగదారులకు సమస్యల పరిష్కారానికి ఎల్లుండి శుక్రవారం దివి19.07.2024 నాడు సీజీఆర్ఎఫ్-1(కన్స్యూమర్ గ్రీవెన్స్ రీడ్రెసెల్ ఫోరం) సమావేశం మండల కేంద్రంలోని రైతు వేదిక భవన్ లో నిర్వహించనున్నట్లు, విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ వినియోగదారుల ఫోరం టీజీ ఎన్పీడీసీఎల్, చైర్ పర్సన్ ఎన్. వి. వేణుగోపాల చారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులు విద్యుత్ లో వోల్టేజ్ సమస్యలు, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ లు మార్చడం, లోపాలున్న మీటర్లు మార్చడం, సర్విస్ పేరు మార్చడం, క్యాటగిరి మార్చడం, అదనపు లోడ్ క్రమబద్ధీకరణ, కరెంట్ బిల్లు లో హెచ్చుతగ్గులు సరి చేయుట, విద్యుత్ బిల్లులు నూతన సర్వీస్ మంజూరు తదితర వాటిని ఫోరం అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటుందని, అందువల్ల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని తాడ్వాయి, గోవిందరావుపేట్, వెంకటాపూర్ (లక్ష్మీదేవి పేట్), ములుగు, మల్లంపల్లి మండలాల విద్యుత్ వినియోగదారులు పాల్గొనాలని కోరారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:00 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.