నవతెలంగాణ-జైపూర్
వెలిశాల మల్లన్న ఆలయం సమీపంలో ఈ నెల 11న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సూరం బ్రహ్మారెడ్డి(58) మంగళవారం కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. బ్రహ్మరెడ్డి శ్రీరాంపూర్ ఏరియా ఆర్కె-6గనిలో కోల్‌కట్టర్‌గా పని చేస్తూ విధులు ముగించుకుని శ్రీరాంపూర్ నుండి చెన్నూర్ వైపు మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తుండగా చెన్నూర్ నుండి మంచిర్యాల వైపు వస్తున్న ట్రాలీ ఢకొీట్టినట్లు తెలిపారు. ప్రమాదంలో బ్రహ్మారెడ్డి కాళ్లు విరిగిపోగా తలకు బలమైన గాయాలు కావడంతో ముందుగా రామకృష్టాపూర్‌లో గల సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు కరీంనగర్ పట్టణంలో గల మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. బ్రహ్మారెడ్డి భీమారం మండలం ఎల్కేశ్వరం గ్రామానికి చెందిన వ్యక్తి. చెన్నూర్ పట్టణం ఆదర్శనగర్‌లో నివాసముంటూ శ్రీరాంపూర్ ఏరియా ఆర్కె-6గని కార్మికుడిగా విధులు నిర్వర్తించేవాడు. మృతునికి భార్య లక్ష్మి, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.