హైదరాబాద్‌లోని సనోఫీ సెంటర్‌ విస్తరణ

Expansion of Sanofi Center in Hyderabadహైదరాబాద్‌: నగరంలోని తమ గ్లోబల్‌ కెపాసిటీ సెంటర్‌ను విస్తరించినట్లు సనోఫీ హెల్త్‌కేర్‌ ఇండియా ప్రకటించింది. నూతన సెంటర్‌ను బుధవారం రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు లాంచనంగా ప్రారంభించారు. 2025 నాటికి 100 మిలియన్ల యూరో (రూ.900 కోట్లు)లతో పాటుగా 2030 నాటికి 400 మిలియన్ల యూరోల (రూ.36వేల కోట్లు) పెట్టుబడులకు ప్రణాళికలు రూపొందించినట్లు ఆ కంపెనీ వెల్లడించింది. ఈ నూతన కేంద్రం వచ్చే రెండేళ్లలో 2600 మంది ఉద్యోగులకు తగిన అవకాశాలను అందించనుందని పేర్కొంది. హైటెక్‌సిటీలోని అత్యాధునిక కార్యాలయం ప్రారంభోత్సవంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్స్‌ సెక్రటరీ అరుణిష్‌ చావ్లా, బెంగళూరులోని ఫ్రాన్స్‌ కాన్సూల్‌ జనరల్‌ థియరీ బెర్థెలాట్‌, సనోఫీ బిజినెస్‌ ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మడేలిన్‌ రోచ్‌ తదితరులు పాల్గొన్నారు.