ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తానన్న మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్

CM Revanth kept his promise of loan waiver before the election– బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలకు ఇది చెంపపెట్టు దెబ్బ
– రుణమాఫీలో ఎవరికైనా లోపాలు జరిగినట్లు ఉంటే, అలాంటి రైతన్నలకు సమస్య పరిష్కారానికి నేనున్న..
– జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు రైతన్నలకు హామీ
– మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలో లక్షలుపు రుణమాఫీ రైతుల సంఖ్య 3699 మంది: ఏవో రాజు
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రైతులకు రుణమాఫీని నెరవేరుస్తున్నారని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఘనత అని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తప్పుడు మాటలు మాట్లాడడం, రుణమాఫీ నెరవేరుస్తుంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి ఇది చెంపపెట్టు దెబ్బ అని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నాడు లక్షలు రుణమాఫీ సంబరాల కార్యక్రమాలు భాగంగా జుక్కల్ నియోజకవర్గం లోని నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలంలో గల లింబూర్ గ్రామంలోని రైతు వేదిక ఆవరణంలో నిర్వహించిన లక్ష లోపు రుణమాఫీ సంబరాల కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రుణమాఫీ రైతులకు అందించేందుకు గురువారం లక్ష లోపు రైతులకు రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించబోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పార్టీ అని, వ్యవసాయ అభివృద్ధికి వ్యవసాయ రైతులకు రెండు లక్షల రుణమాఫీ నెరవేర్చడం రైతులు ఎంతో సంతోష పడుతున్నారని తెలిపారు. ఈ రుణమాఫీ కార్యక్రమంలో ఎవరికైనా రుణమాఫీ కాకుండా ఏదైనా లోపాలు ఏర్పడితే అలాంటి సమస్యల పరిష్కారానికి రైతులకు ఎల్లవేళలా తాను కృషిచేసి ఆ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు అన్యాయం జరగకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. లింబూర్ గ్రామ రైతు వేదికలో ఏర్పాటుచేసిన లక్షలు రుణమాఫీ సంబరాల కార్యక్రమానికి డోంగ్లి మండలంలోని వివిధ గ్రామాల నుండి వందలాది మంది రైతులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల వ్యవసాయ అధికారి రాజు మాట్లాడుతూ.. ఇరు మండలాల్లో కలిసి లక్ష లోపు రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య 3699 మంది ఉన్నట్లు తెలిపారు. ఈ సంబరాల కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు తో పాటు డోంగ్లి మండల తాసిల్దార్ రేణుక చౌహన్ ఉమ్మడి మండల వ్యవసాయ అధికారి రాజు డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బసవరాజ్ పటేల్, డోంగ్లి సింగిల్ విండో మాజీ చైర్మన్ శివాజీ పటేల్, లింబూర్ గ్రామ పెద్దలు, ఆ గ్రామ పటేల్, అలాగే మండలంలోని వ్యవసాయ రైతులు, పెద్ద సంఖ్యలో పాల్గొని రుణమాఫీ సంబరాలు జరుపుకున్నారు.