
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ హామీ ప్రకారం గురువారం నాడు లక్ష లోపు రుణమాఫీ రైతులందరికీ రుణమాఫీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించడం ప్రతి మండలంలో రుణమాఫీ సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. జుక్కల్ నియోజకవర్గం లోని నూతనంగా ఏర్పడ్డ డోంగ్లి మండలంలో గల లింబూరు గ్రామంలో రైతు వేదికలు నిర్వహించిన రుణమాఫీ సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు వ్యవసాయ రైతులు ఎడ్ల బండి పై సవారి చేపట్టి సన్మానాలు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ డోంగ్లి మండల అధ్యక్షులు బసవరాజ్ పటేల్ ఆధ్వర్యంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు రుణమాఫీ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.