
తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ చైర్మన్ గా నిన్న బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి నేరెళ్ల శారద గారిని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళా కమిషన్ చైర్మన్ తో మహిళల పట్ల వారి హక్కుల పట్ల కమిషన్ పరంగా తగిన న్యాయం చేకూరేలా కృషినీ అందించి మహిళల మన్ననాలు పొందాలని కోరినట్లు తెలిసింది. ఎమ్మెల్యే వెంట పలువురు నాయకులు పాల్గొన్నారు.