25వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత- రాజు…
నవతెలంగాణ – గోదావరిఖని
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని చికెన్ వేస్టేజ్ సంబంధించిన వ్యవహారం ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండా కొనసాగుతుందని 25వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత- రాజు ఆరోపించారు. కార్పొరేషన్ లోని కొందరి అధికారుల అధికార పార్టీ నాయకుల చేతివాటంతో చికెన్ వేస్టేజీ దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతుందన్నారు. కాసుల కోసం కక్కుర్తి పడే కొందరు నాయకులు ఎలాంటి టెండర్ లేకుండానే అధికారుల కనుసన్నల మధ్య యధాచ్చేగా జోరుగా జరుగుతుందని అన్నారు. ప్రతి రోజు కోల్ బెల్ట్ ప్రాంతంలోని చికెన్ షాప్ ల నుంచి సేకరించిన వేస్టేజ్ అంతా పరిసర ప్రాంతాలలో క్యాట్ ఫిష్ చేపల పెంపకం కోసం వినియోగిస్తున్నారని అన్నారు. ఇలా పెంచిన చేపలను తినడం వల్ల ప్రజల అనారోగ్యాల బారిన పడతారని పేర్కొన్నారు. ఇలాంటి క్యాట్ విష్ణు పెంచడం నిషేధమే అయినప్పటికీ జనం ప్రాణాలతో చెలగాటమారడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న కొంతమంది నాయకులు చేస్తున్న వ్యవహారాన్ని అధికారులు పట్టించుకోక పోవడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన వారవుతారని అన్నారు. అన్ని మున్సిపల్ కార్పొరేషన్ లలో వేస్టేజి టెండర్ ప్రక్రియ జరిగినప్పుడు రామగుండం కార్పొరేషన్ లో మాత్రం నాయకుల, అధికారుల జేబులు నింపుకోవడానికి సరిపోతుందని అన్నారు. ఇక్కడి చికెన్ వేస్టెజ్ హైదరాబాదులోని ఓ కంపెనీకి తరలించి, సాంకేతిక పద్ధతిలో పొడిగా మార్చి చేపలకు దాణాగా, కుక్కలకు బిస్కెట్లు తయారు చేస్తారని అన్నారు. ఇలాంటి ప్రక్రియ ఉన్నప్పటికీ రామగుండం కార్పొరేషన్ లో మాత్రం అధికారులు స్పందించడం లేదన్నారు దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు.