5 లక్షల రూపాయలు భీమా చెక్కు అందజేసిన కొణిదెల నాగబాబు

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: ప్రతి జన సైనికుడికి వీర మహిళలకు భరోసా కల్పించడమే ధ్యేయంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులకు బీమా సదుపాయం కల్పించిన గొప్ప వరమనీ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు.మునుగోడు నియోజకవర్గంలో 300 పైగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రంలో 3వ స్థానంలో అత్యధికంగా నమోదు చేయించామని చౌటుప్పల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు పర్నె శివారెడ్డి తెలిపారు.జనసేన క్రియాశీలక సభ్యులు సంగం చంద్రశేఖర్ చౌటుప్పల్ లో ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులను కుటుంబానికి అందేలా జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కృషి చేశారనీ పర్నె శివారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, రాధ రాజలింగం మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ గోకుల రవీందర్ రెడ్డి జన సైనికులు పాల్గొన్నారు