ముఖ్య మంత్రి టేలికాన్ఫరెన్స్.. హుషారుగా హాజరైన రైతులు..

Chief minister's teleconference.. Farmers who attended smartly..నవతెలంగాణ – డిచ్ పల్లి
రైతు రుణమాఫీ లో బాగంగా మొదటి విడతగా రూ.లక్ష రూపాయలలోపు నేరుగా రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన టేలికాన్ఫరేన్స్ కు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్బంగా సహకార సొసైటీ చైర్మన్లు చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని, ప్రతి రైతు ముఖం లో చిరునవ్వు ఉందని,ఇది రైతు ప్రభుత్వమని, రాబోవు రోజుల్లో రైతులు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నో పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. అనంతరం టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ రూరల్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ చింతల కిషన్, కిసాన్ కేత్ మండల అధ్యక్షులు ఎల్ ఐ సి గంగాధర్, సిఈఓలు తేజ గౌడ్, ఉప్పల్ వాయి రతన్, తహసిల్దార్ వెంకట్రావు, వ్యవసాయ విస్తరణ అదికారులు ప్రకాష్ గౌడ్, శ్రీహరి, సతీష్, బోర్ వేల్ రాజేందర్ రెడ్డి, తోపాటు నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.