రుణమాఫీ వ్యవసాయదారులకు గొప్ప వరం

– సంబరాల్లో బిచ్కుంద ఏడిఏ లక్ష్మి ప్రసన్న
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయదారులకు అందించిన రుణమాఫీ కార్యక్రమం ఒక గొప్ప వరం లాంటిదని వ్యవసాయ శాఖ బిచ్కుంద ఏడిఏ లక్ష్మి ప్రసన్న అన్నారు. రుణమాఫీ సంబరాల కార్యక్రమంలో భాగంగా గురువారం మద్నూర్ రైతు వేదికలో పాల్గొన్నారు ఆమె ఈ సంబరాల గురించి మాట్లాడారు. వ్యవసాయదారులకు ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయడం రైతులకు ప్రభుత్వం ఆదుకోవడం గొప్ప వరమేనని పేర్కొన్నారు. ప్రభుత్వ సహాయాన్ని వ్యవసాయదారులు మరువలేరని రెండు లక్షల వరకు రుణమాఫీ చెయ్యడం వ్యవసాయదారుల కు విముక్తి కల్పించడమేనని తెలిపారు.