జుక్కల్ లో సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

MLA started central lighting works in Jukkalనవతెలంగాణ – జుక్కల్

జుక్కల్ మండల కేంద్రంలోని బసవేశ్వర్ చౌక్ నుండి గండూర్  రోడ్  తెలంగాణ తల్లి విగ్రహం నుండి జడ్పీహెచ్ఎస్ పాఠశాల వరకు సెంట్రల్ లైటింగ్ పనులను శుక్రవారం నాడు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంబించారు. ఈ సంధర్భంగా మండల కేంద్రంలో పెరుకు పోయిన అతిపెద్ద సమస్య సెంట్రల్ లైటింగ్ ఉండేది. ఎప్పుడెపేప్పుడా అని ఎదురు చూస్తున్న క్రమంలో నియేాజక కేంద్రం అయిన జుక్కల్ లో సెంట్ర్లల్ లైటింగ్ పనులను ఎమ్మెలే తోట లక్ష్మీ కాంతారావ్  ఎస్డీఎఫ్ నిధులనుండి   కేటాయించి ప్రారంబించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేసున్నారు.  గత ప్రభూత్వ హయంలో కబడా హడావిడిగా ఎన్నికల ముందు స్థానిక  బీఆర్ఎస్  ప్రారంబించారు. కానీ ఎక్కడ పడిన గొంగడి అక్కడే ఉండి ప్రజలకు మబ్య పెట్టారని ప్రస్తుతం కాంగ్రేస్ హయంలోనైన పనులు పూర్తయితే సంతోషం ఉంటుందని మండల వాసులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెలే తో పాటు పార్టీ నాయకులు వర్కింగ్ ప్రసిడెంట్ వినోద్, సీనీయర్ నాయకుడు కల్లాలీ రమేష్ రావ్ దేశాయి, మాజీ ఎంపిపి లక్ష్మన్ పటేల్  తదితర  కాంగ్రేస్ నాయకులు పాల్గోన్నారు.