లయన్ సహారా నిజామాబాద్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రిడ్జ్ అందజేత 

Body fridge is provided by Lion Sahara Nizamabadనవతెలంగాణ – కంఠేశ్వర్ 
లయన్ సారా నిజామాబాద్ ఆధ్వర్యంలో డిచ్పల్లి మండలం యానంపల్లి గ్రామానికి బాడీ ఫ్రిడ్జ్ ను గ్రామపంచాయతీ కార్యాలయం నందు గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామ పెద్దలకు సింగిల్ విండో చైర్మన్ రామచంద్ర గౌడ్ కోరిక మేరకు లయన్ సహారా తరఫున అందజేయడం జరిగిందని జిల్లా కార్యదర్శి ఉదయ సూర్య భగవాన్ తెలిపారు. లయన్ సహారా ద్వారా మరిన్ని సేవలు అందిస్తామని లయన్ అధ్యక్షులు నరసింహారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సింగిల్ విండోస్ చైర్మన్ రామచంద్ర గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అంజయ్య, కార్యదర్శి అంకం గిరి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.