నవతెలంగాణ – రెంజల్
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ పై ప్రత్యేక దృష్టి సారించిందని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం రెంజల్ మండలంలోని సామియా గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి ఆయన ముఖ్యఅతిథి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలలో భాగంగా రుణమాఫీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి రైతు తమ ప్రభుత్వ హయాంలో ఏ లాంటి కష్టాలు పడకూడదని రైతు రుణమాఫీ ప్రకటించింది అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. ప్రత్యేకంగా విద్యా వ్యవస్థను పటిష్ట పరచాలన్న ఉద్దేశంతో ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేక నిధులను కేటాయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ ప్రతి విద్యార్థి 80% మార్కులతో ఉత్తీర్ అయ్యేలా పనిచేయాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా డిప్యూటేషన్ పద్దతిలో నియమించాలని అధికారులను ఆదేశించారు. రాబోవు కాలంలో నిజం చెక్కర ఫ్యాక్టరీని సైతం పునరుద్ధరించే దిశలో తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. యువతకు తమ అర్హతలను బట్టి ఉద్యోగాలను ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోధనా ఆర్డీవో రాజేశ్వర్, ఎసిపి శ్రీనివాస్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్ అమ్దాన్, స్థానిక నాయకులు మోబిన్ ఖాన్, మాజీ జెడ్పిటిసి నాగభూషణం రెడ్డి, జావేద్, సాయి రెడ్డి, సుంచు రాములు, ధనుంజయ్, సాయిబాబా గౌడ్, సురేందర్ గౌడ్, గంగా కృష్ణ, జియాసోద్దీన్, శనిగరం సాయి రెడ్డి, ఎమ్మెస్ రమేష్ కుమార్, గైని గంగాదర్, ఇందిరా దేవి, ప్రజా ప్రతినిధులు యువజన నాయకులు, పాల్గొన్నారు.