నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని ఎస్ టి ఓ కార్యాలయం లో కురుస్తున్న వర్షానికి పైకప్పు నేలకు రాలుతుంది దీనితో కార్యాలయంలో గల కంప్యూటర్లు ఇతర సామాగ్రి నష్టం వాటిల్లి కార్యాలయ విధులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కార్యాలయం పైకప్పు కూలి కంప్యూటర్లు చెడిపోయాయి. కరెంటు సరఫరాకు ఆటంకం ఏర్పడింది విధులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ కార్యాలయానికి దాదాపు మూడు సంవత్సరాల క్రితం లక్షలాది రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేయించారు. తూతూ మంత్రంగా మరమ్మతులు చేపట్టడం గత ఏడాది కూడా వర్షాకాలంలో పైకప్పు కూలిపోయి కంప్యూటర్లు పాడైపోయాయి. కార్యాలయం కొన్ని రోజులు వే రచోట నడిపించుకోవలసి వచ్చింది. మరమ్మత్తుల కోసం కేటాయించిన నిధులతో కొత్త బిల్డింగే పూర్తయ్యేది. అలాంటి నిధులు తూతూ మంత్రంగా ఖర్చులు చేసి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టి ఎస్టిఓ కార్యాలయం శాశ్వతంగా ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.