మీసేవ ఎంపికలో దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలి..

Disability should be given first priority in selection of service.– పీడీకి వినతి పత్రం అందజేత..
నవతెలంగాణ – డిచ్ పల్లి
జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ దివ్యాంగులను గుర్తించి మీసేవ కేంద్రాలలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ శుక్రవారం డిఅర్ డిఎ డిఅర్ డిఓ పిడి సాయగౌడ్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో ఎంతోమంది దివ్యాంగులు ఎన్నో ఉన్నత చదువులు చదివి కూడా ఉపాధి లేకుండా గత కొన్ని ఏళ్ల నుండి ఎక్కడ కూడా బ్యాక్ లాక్ పోస్టులు గత ప్రభుత్వాలు భర్తీ చేయకపోవడం వల్ల కనీసం స్వయం ఉపాధి కొరకు రుణాలు కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వం 2008, 2009 సంవత్సరంలో దాదాపు స్త్రీ, పురుషులను కలుపుకొని 60 నుండి 70 మంది దివ్యాంగులకు ఉపాధి కొసం డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ శివారులోని సాంకేతిక శిక్షణ కేంద్రం లో శిక్షణ ఇప్పించారని వాపోయారు. కానీ ఇంతవరకు వారిని గుర్తించకపోగా కనీసం వారు శిక్షణ ఉత్తీర్ణత పొందినటువంటి సర్టిఫికెట్లు ఇంతవరకు ఇవ్వలేదని వివరించారు.  ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అర్హులైన వారిని గుర్తించి వారికి ఉపాధి కల్పించాలని కోరుతున్నాట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 40 రకాల సేవలు అందించడానికి గ్రామ సంఘాల ద్వారా మీ సేవ కేంద్రాలకు నిర్వహించుకోవడానికి స్త్రీ నిధి నుండి 2.5 లక్షల రుణాన్ని కూడా ప్రభుత్వమే ఇస్తుందని ప్రకటించాడం జరిగిందని,తక్షణమే జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ దివ్యాంగులను గుర్తించి మీసేవ కేంద్రాలలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని డి ర్ డి ఓ పి డి సాయ గౌడ్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్య వంశీ, విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు బీరప్ప జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.