
అఖిలభారత రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగిందని సీపీఐ (ఎంఎల్) ప్రజా పంత మండల విప్లవ జోహార్లు అర్పించారు. చంద్రశేఖర అన్న గతంలో దున్నేవాడికి భూమి అని నినాదంతో ప్రజాసేవ లో నిమగ్నమై అనేక ఉద్యమాలు చేశారని, 45 సంవత్సరాలు జీవిత ప్రజల కోసం తన సేవలను అందించాలని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ డివిజన్ నాయకులు డి రాజేశ్వర్, జిల్లా నాయకులు పుట్టి నడిపి నాగన్న, పార్వతి రాజేశ్వర్, మండల నాయకులు వడ్డెన్న, షేక్ నజీర్, గోపాల్, సంతోష్, గంగాధర్, జబ్బార్, సిద్ధ పోశెట్టి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.