తెలంగాణ యూనివర్సిటీ లోని గర్ల్స్ హాస్టల్ మెస్సులో జరిగే వరస సంఘటనలను తీవ్రంగా పరిగణించిన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి ఉదయం 6 గంటల నుండి 9:30 గంటల వరకు హాస్టల్ పరిసరాలను పరిశీలించి ఆహారంలో కీటకాలు రావడానికి గల కారణాలను హాస్టల్ సిబ్బంది, విద్యార్థులతో ముఖాముఖి చర్చించి వైస్ ఛాన్సలర్ కు సమాచారాన్ని అందించారు.అనంతరం వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య.ఎం.యాదగిరి యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ఆచార్య.కే.అపర్ణ చీఫ్ వార్డెన్ డాక్టర్.ఏ.మహేందర్ త్రీమెన్ కమిటీని నియమించారు. ఈ త్రీ మెన్ కమిటీ వెంటనే రంగంలోకి దిగి హాస్టల్‌ను తనిఖీ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేర్ టేకర్లు 24 గంటలు విజిలెంట్ గా ఉండే విధంగా చర్యలకు శ్రీకారం చుట్టారు.ఐదుగురు సీనియర్ మహిళా లతో మానిటరింగ్ కమిటీని నియమించారు. ఈ కమిటీ హాస్టల్ పరిసరాలను, నాణ్యమైన వంట సామాన్లను, తాజా కూరగాయలను అందించుటకు కృషి చేయాలని తీర్మానించినారు. హాస్టల్లో కంప్లైంట్ బాక్స్ ను ఏర్పాటు చేసి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రిజిస్ట్రార్ ఆదేశించినారు.హాస్టల్లో ఇలాంటి సంఘటన పునారవృతం అయితే హాస్టల్ సిబ్బందిని తొలగించి కలెక్టర్ ఆధ్వర్యంలో నడిచే ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగిస్తామని రిజిస్ట్రార్ వెల్లడించారు.