రుణమాఫీ చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ కే దక్కింది

The honor of showing the loan waiver went to the Congress– తెలంగాణలో రుణమాఫీ దేశానికే ఆదర్శం
– మద్నూర్ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతా
– మద్నూరులో ఎడ్లబండ్లు ట్రాక్టర్లతో సంబరాల ర్యాలీ రైతు వేదికలో సభ
నవతెలంగాణ – మద్నూర్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ చెయ్య లేనిది సాధ్యం కానిది అంటూ అవాకులు చవాకులు పలిచిన నాయకులకు రుణమాఫీ చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని, రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, వెనుకబడిన మద్నూర్ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చి దిద్దుతానని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు రైతులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం మద్నూర్ మండల కేంద్రంలో రుణమాఫీ సంబరాల కార్యక్రమాలు మండల రైతులు పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. రుణమాఫీ సంబరాలు అంగరంగ వైభోగంగా ఎడ్లబండ్ల ర్యాలీ ట్రాక్టర్ల ర్యాలీ టపాకాయల కాల్చివేత కేక్ కటింగ్ భారీ ఎత్తున జరిపారు. ఈ సందర్భంగా రైతు వేదికలు ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు అవాకులు చవాకులు మాట్లాడిన నాయకులకు రుణమాఫీ చేసి చూపించిన ఘనత కాంగ్రెస్కే దక్కిందని, అలాంటి నాయకులకు రుణమాఫీ నిరూపించడం అలాంటి వ్యక్తులు ఏమి సమాధానం ఇస్తారని ఎదవ వేశారు. ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. మద్నూర్ మండల అభివృద్ధికి ప్రత్యేకంగా చొరవ చూపుతానని ఈ మండలాన్ని అభివృద్ధిలో ఆదర్శ మండలంగా తీర్చి దిద్దుతానని తెలిపారు. మండల కేంద్రంలో సెంటర్ లైటింగ్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సంబరాల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు యువ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చిన వ్యవసాయ రైతులు వీరితో పాటు మండల తహసిల్దార్ ఎండి ముజీబ్ డిప్యూటీ తాసిల్దార్ భారత్ ఆర్ఐ శంకర్ ఏఈవోలు ప్రియాంక సతీష్ తదితరులు పాల్గొన్నారు.