హరీష్ రావుని విమర్శించే నైతిక హక్కు చెరుకు శ్రీనివాస్ లేదు 

Cheruku Srinivas has no moral right to criticize Harish Rao– బీఆర్ఎస్ దుబ్బాక నియోజకవర్గ యువజన అధ్యక్షుడు 
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
మాజీ మంత్రి ,సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి లేదని బీఆర్ఎస్ దుబ్బాక నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాపని సురేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని అక్బర్పేట్ భూంపల్లి మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి ని అక్కున చేర్చుకున్న టీఆర్ఎస్ పార్టీ నీ వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని, తాజాగా జరిగిన దుబ్బాక ఎమ్మెల్యే ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పై విమర్శించడం మానుకోవాలని డిమాండ్ చేశారు.దుబ్బాక కాంగ్రెస్ పార్టీకి నిజమైన బాధ్యులు ఎవరో తెలియక అటు శ్రావణ్ కుమార్ రెడ్డి వర్గం, ఇటు చెరుకు శ్రీనివాస్ రెడ్డి వర్గం కొట్లాడుకునే పరిస్థితి నెలకొందన్నారు.ఇక ఆపదలో ఉన్న మిగతా కార్యకర్తలకు వారేమీ చేస్తారో తెలియదన్నారు. తాజాగా రుణమాఫీ సంబరాల్లో హరీష్ రావ్ పై చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు.