త్వరలో జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి రాక

Adialabad,Navatelangana,Telugu News,Telangana.– కలెక్టర్‌ రాజర్షిషా
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
జిల్లాలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించేందుకు ఆయా శాఖలకు విధులను కేటాయించడం జరిగిందని కలెక్టర్‌ రాజర్షిషా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ గౌస్‌ ఆలం, ఐటీడీఏ పీఓ ఖుష్బు గుప్తాతో కలిసి సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అతిత్వరలో సీఎం రేవంత్‌రెడ్డి పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసేందుకు జిల్లాకు రానున్నట్లు పేర్కొన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హెలిపాడ్‌ వద్ద షామియానా, కుర్చీలు, బారికేడ్‌ ఏర్పాట్లు చేయాలని అన్నారు. రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో మహిళా శక్తి క్యాంటీన్‌, ఏంఆర్‌ఐ మిషన్‌, కేజీబీవీ హై స్కూల్‌, బంగారుగూడ, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, మధర్‌ పౌల్ట్రీ యూనిట్‌లను ఓకే చోట బటన్‌ క్లిక్‌ చేసి ప్రారంభిస్తారని తెలిపారు. టీటీడీసీలో ఏర్పాటు చేసిన సమావేశానికి లంచ్‌, తదితర ఏర్పాట్లను ప్రత్యేక శ్రద్ధతో అధికారులకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. సానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ మేరకు ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ దగ్గర పోలీసు బందోబస్తుతో పాటు అత్యవసరమైన వారిని మాత్రమే లోనికి పంపించేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌, పోలీస్‌, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.