అద్భుతమైన మెలోడీగా సారా సారా..

Sara Sara as a wonderful melody..‘మెరిసే మెరిసే’ చిత్రంతో పవన్‌ కుమార్‌ కొత్తూరి దర్శకుడిగా విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ దర్శకుడు హీరోగా తన అదష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ‘యావరేజ్‌ స్టూడెంట్‌ నాని’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్‌ కుమార్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్‌ కుమార్‌ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఉన్న కూల్‌ వెదర్‌కు తగ్గట్టుగా, మనసుకు హత్తుకునేలా, హాయినిచ్చేలా సాగే ఓ మెలోడీ పాటను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ‘సారా సారా..’ అంటూ సాగే ఈ పాటను శివకష్ణచారి ఎర్రోజు రచించగా, పద్మలత, అనుదీప్‌ దేవ్‌ ఆలపించారు. కార్తిక్‌ బి కొడకండ్ల ఇచ్చిన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్‌, వివియా సంత్‌ హీరోయిన్లుగా నటించారు.